Share News

పరమాత్ముడే ఆపద్బాంధవుడు

ABN , Publish Date - May 04 , 2025 | 11:17 PM

ఆపదలో ఆపద్బాంధవుడిగా ని లిచేది పరమాత్ముడేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విద్వాన్‌ తుప్పసక్కిరి ప్రహ్లాదాచారి పేర్కొన్నారు.

 పరమాత్ముడే ఆపద్బాంధవుడు
సప్తాహ మంగళ కార్యక్రమంలో సీతారామారావు దంపతులు

- భాగవత సప్తాహ ముగింపు ఉత్సవాల్లో విద్వాన్‌ ప్రహ్లాదాచారి

- కోటకొండలో ఘనంగా ముగిసిన స్వర్ణోత్సవాలు

నారాయణపేటరూరల్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): ఆపదలో ఆపద్బాంధవుడిగా ని లిచేది పరమాత్ముడేనని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ విద్వాన్‌ తుప్పసక్కిరి ప్రహ్లాదాచారి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కోటకొండ నరసాచలంలోని భూలక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్వర్ణోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భం గా భాగవత సప్తాహ మంగళ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణుడి జన్మ వృత్తాంతాన్ని, బాల్య లీలలను వివరించారు. ప్రతీ ఒక్కరు భగ వంతుడిపై అచంచల విశ్వాసాన్ని, అనన్య భక్తిని కలిగి ఉండాలని విద్వాంసులు ఉద్బోధించారు. ఆలయంలో బృహతీ సహస్రయాగం, మహాపూర్ణాహుతి నిర్వహిం చారు. అనంతరం హంపీ క్షేత్రానికి చెందిన గోవింద తీర్థ మహాస్వాముల వారు భక్తులకు అవభృత ప్రోక్షణం చేసి ఆశీస్సులను అందజేశారు. నారాయణపేట శక్తి పీఠం వ్యవస్థాపకుడు డాక్టర్‌ స్వామీ శాంతానంద్‌ పురోహిత్‌ మాట్లాడుతూ జిల్లా లో రఘుప్రేమ తీర్థులు విశేషంగా సంచరించి రాఘవేంద్రస్వామి ఆలయం, శ్రీకృ ష్ణుడి ఆలయాలను ప్రతిష్ఠింప జేశారన్నారు. అనంతాచార్యులు మాజీ సర్పంచ్‌ కిషన్‌రావు నేతృత్వంలో భూలక్ష్మీ వెంకటే శ్వరస్వామి ఆధ్మాత్మిక దివ్యక్షేత్రాన్ని నరసాచలంలో ఏర్పాటు చేశారన్నారు. నర సాచల సేవాసమితి సభ్యులు సీతారామారావు, జనార్దన్‌రావు, ప్రభంజన్‌రావు, జ యతీర్థాచారి, శ్రీపాద్‌ కులకర్ణి, శ్రీనివాస్‌,భరత్‌, హన్మేష్‌, ప్రకాశ్‌, శేషుపాల్గొన్నారు.

Updated Date - May 04 , 2025 | 11:18 PM