ఎండ ప్రచండం
ABN , Publish Date - May 05 , 2025 | 11:27 PM
రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి.
వనపర్తి జిల్లాలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
వనపర్తి/నారాయణపేట/గద్వాల, మే 5 (ఆంధ్రజ్యోతి) : రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకున్నాయి. వనపర్తి జిల్లా గోపాల్‌పేట, కొత్తకోటలో పెబ్బేరు లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మదనాపూర్‌లో 42.3, పాన్‌గల్‌లో 42.1, పెద్దమందడిలో 41.9, చిన్నంబావి, అమరచింత, శ్రీరంగాపూర్ లలో 41.5, ఆత్మకూరులో 41.3, ఘణపూర్‌లో 41.0, వీపనగండ్లలో 40.8, రేవల్లి, వనపర్తి లలో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా వనపర్తిలో 24.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో 42 డిగ్రీలు, మల్దకల్‌లో 41.9, గట్టులో 41.8, గద్వాల, ఇటిక్యాలలో 41.6, కేటీదొడ్డిలో 41.5, అయిజలో 41.5, వడ్డేపల్లిలో 41.1, ధరూర్‌లో 41.1, ఉండవెల్లిలో 40.8, మానవపాడులో 37.3 డిగ్రీలుగా నమోదైంది. కనిష్ఠ ఉష్ణోగ్రతల 26.9 డిగ్రీలు నమోదైంది. నారాయణపేట జిల్లాలో గరిష్ఠంగా 39 డిగ్రీలు, కనిష్ఠంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నాగర్‌కర్నూల్ జిల్లాలో గరిష్ఠం 38 డిగ్రీలు, కనిష్ఠం 25 డిగ్రీలుగా నమోదైంది.