Share News

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం

ABN , Publish Date - Sep 02 , 2025 | 11:24 PM

గద్వా లలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు.

డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం
ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, అధికారులు

  • 6వ తేదీన ప్రారంభించనున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి

  • ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్‌ బీఎం. సంతోష్‌, ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గద్వా లలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్ల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. ఐదేళ్ల క్రితం దౌదర్‌పల్లి వద్ద 1,275 ఇళ్లను వివిధ దశల్లో నిర్మించారు. వివిధ కారణాల వలన పంపిణీ చేయలేదు. ప్ర స్తుతం వార్డులవారీగా లాటరీ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అధికారులతో సమీ క్ష నిర్వహించి మిగిలిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం డ బుల్‌ బెడ్రూం ఇళ్ల వద్దకు వెళ్లి పెండింగ్‌ పనులను గుర్తించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పే దల సొంతింటి కళను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎంతో కాలంగా ఇళ్లు లేని నిరుపేదలు ఇళ్ల పంపిణీ కోసం ఎదురుచూస్తున్నారని, శనివారం 6న రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రె డ్డి చేతులమీదుగా వారికి గృహప్రవేశాలు చేయిస్తామని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ హె చ్‌ -3 బ్లాక్‌లో మంత్రి చేతులమీదుగా గృహ ప్ర వేశాలు చేయిస్తామని, ఆలోపు పారిశుధ్య, పెం డింగ్‌ పనులను పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. వారివెంట అదనపు కలెక్టర్‌ నర్సింగరావు, గృహనిర్మాణ శాఖ పీడీ ఉన్నారు.

Updated Date - Sep 02 , 2025 | 11:26 PM