Share News

చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:37 PM

మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్ల పంపిణీకి అధికారులు రం గం సిద్ధం చేశారు.

చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం

- టెండర్లు పూర్తి చేసిన అధికారులు

- మళ్లీ పాత కాంట్రాక్టర్‌కే అప్పగింత

- ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే 12 పైసలు అధికం

గద్వాల, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మత్స్యకారుల ఉపాధికి దోహదపడుతున్న ఉచిత చేపపిల్ల పంపిణీకి అధికారులు రం గం సిద్ధం చేశారు. ఇద్దరు కాంట్రాక్టర్‌లలో ఒకరు వెనకడుగు వేశారు. టెండర్‌ వేసే సమయంలో ఆయన ధర ఎక్కువగా ఉండ టంతో పాత కాంట్రాక్టర్‌కే మళ్లీ అప్పగించారు. ఇది ఆయనకు వరుగా నాల్గోసారి దక్కింది. ప్రభుత్వం 35-40 ఎంఎం చేపపిల్ల ధరను రూ.0.66పైసలు నిర్ణయించగా కాంట్రాక్టర్‌ రూ.0.68 పైసలకు నెగోషియేషన్‌ చేసుకున్నారు. అదేవిధంగా 80-100 ఎంఎం చేపపిల్ల ప్రభుత్వం ధర రూ.1.66 పైసలకు నిర్ణయించగా కాంట్రాక్టర్‌ రూ. 1.78పైసలకు దక్కించుకున్నా రు. తప్పని పరిస్థితిలో అధికారులు నెగోషియేషన్‌ చే శారు. మరో మూడు రో జులలో చేపపిల్లలు చెరువులకు చేరునున్నాయి.

చలికాలం వస్తుండటంతో...

చేపపిల్లల పంపిణీ ప్రతీ ఏటా ఆలస్యంగానే జరుగుతుండగా ఈ ఏడాది మరింత ఆలస్యం అయ్యింది. దీంతో చేపలు ఎదగ డం లేదు. చెరువులలో వదిలే చేప పిల్లల సైజు ఎక్కువగా 35-40ఎంఎం పొడవు ఉం టాయి ఇవి ఎదగడానికి ఆరు నెలల సమ యం పడుతుంది. ఆలోపు చెరువులలో నీటి మట్టం తగ్గిపోతుంది. దానికి తోడు చలికాలం ప్రారంభం కావడంతో చేప ఎదుగుదల తక్కువగా ఉంటుందని మత్స్యకారులు వాపోతున్నారు. ప్రతీ ఏటా 1.69కోట్ల చేప పిల్లల పంపిణీ జరిగేది. గతేడాది కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని సగానికి తగ్గించి 90లక్షలే పంపిణీ చేసింది. ఈ ఏడాది పూర్థిస్థాయిలో పంపిణీ చేయాలని నిర్ణయిచింది. 35-40ఎంఎం చేపపిల్లలు 54లక్షలు, 80-100 చేపపిల్లలు 1.15కోట్లను పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.

జిల్లాలో 7వేల మంది మత్స్యకారులు

జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు ఏడువేల మంది మత్స్యకారులు ఉన్నారు. 94మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. ముదిరాజ్‌లు దాదాపు వారి వృత్తిపైనే ఆధారపడి ఉన్నారు. జిల్లాలో 441 చెరువు, కుంటలు, 8 రిజర్వాయర్‌లు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువు, కుంటలు, కళకళలాడుతున్నాయి. దీంతో చేపపిల్లలు ఎప్పుడు సరఫరా చేస్తారా అని ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రభుత్వం చేపపిల్లల పంపిణీకి రంగం సిద్ధం చేయడంతో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:37 PM