ఎస్‌జీటీలపై చర్యలకు రంగం సిద్ధం
ABN , Publish Date - Apr 25 , 2025 | 11:33 PM
స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ)లపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
- వారికి మరో మారు నోటీసులు
- ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
మహబూబ్‌నగర్ విద్యావిభాగం, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి) : స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్‌జీటీ)లపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లాలో గత సంవత్సరం బదిలీల సందర్భంగా భార్యాభర్తలైన ఉపాధ్యా యులు, భార్య లేదా భర్త ఇతర శాఖలో ఉద్యోగిగా ఉన్న వారు కొందరు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా సమాచారం ఇచ్చి హెచ్‌ఆర్‌ఏ ప్లేసులు తీసుకున్నారు. వారికి గత ఏడాది అక్టోబరు 25న నోటీసులు ఇచ్చి, వివరణ ఇవ్వాలని కోరుతూ ఆయా మండలాల విద్యాశాఖ అధికారులతో ఆదేశాలు జారీ చేశారు. అయితే అప్పట్లో డీఈవో రవీందర్ ఏసీబీకి చిక్కడంతో పట్టుబడటంతో నోటీసులు మరుగున పడ్డాయి. తాజాగా జీహెచ్‌ఎంల స్పౌజ్ పాయింట్లు దుర్వినియోగానికి సంబంధించి, మరో మారు ఆర్‌జేడీ నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో వారిపై చర్యలకుఫై ల్ సిద్ధమైంది. ఈ నే పథ్యంలో ‘జీహెచ్ ఎంలకు మరో మారు నోటీసులు’ శీర్షిక న ‘ఎస్‌జీటీలపై చ ర్యలు ఎందుకు తీసుకోరు..?’ అని ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసిన ఎస్‌జీటీ లకు సంబందించిన ఫైల్‌ను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారులు బయటకు తీశారు. అందులో ఉన్న ఏడుగురు ఎస్‌జీటీలకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. వారి వివరాలను డీఈవో ప్రవీణ్‌కుమార్ ‘ఆంధ్రజ్యోతి’కి వెల్లడించారు. ఎడుగురు ఎస్‌జీటీలకు మరో మారు నోటీసులు ఇవ్వను న్నట్లు తెలిపారు.