Share News

సర్దార్‌ స్ఫూర్తిని కొనసాగించాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 10:58 PM

దేశ సమైక్యతకు జీవితాంతం కృషి చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తిని కొనసాగించాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు.

సర్దార్‌ స్ఫూర్తిని కొనసాగించాలి
నాగర్‌కర్నూల్‌ ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌ నుండి ట్యాంక్‌బండ్‌ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గైక్వాడ్‌వైభవ్‌ రఘునాథ్‌, పోలీస్‌ సిబ్బంది

- ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌

- ఉత్సాహంగా ‘రన్‌ ఫర్‌ యూనిటీ’

నాగర్‌కర్నూల్‌ క్రైం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : దేశ సమైక్యతకు జీవితాంతం కృషి చేసిన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్ఫూర్తిని కొనసాగించాలని నాగర్‌కర్నూల్‌ ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ అన్నారు. పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నాగర్‌కర్నూల్‌ పట్టణంలో ఏక్తా దివస్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగా నిర్వహించిన ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. పట్టణంలోని ఓల్డ్‌ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వరకు రన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశ సమైక్యతకు కృషి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అని కొనియాడారు. ఆయనను స్మరించుకోవడంతో పాటు, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్‌బీ సీఐ కనకయ్య, డీసీఆర్‌బీ సీఐ ఉపేంద్రరావు, ఆర్‌ఐ జగన్‌, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ప్రశాంత్‌, శివాజీతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

నివాళి అర్పించిన ఎస్పీ

సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతిని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్‌ చిత్రపటానికి ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, పోలీస్‌ సిబ్బంది పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌, ఎస్‌బీ సీఐ కనకయ్య, డీసీఆర్‌బీ సీఐ ఉపేంద్రరావు, ఆర్‌ఐ జగన్‌, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ప్రశాంత్‌, ఎస్‌పీ సీసీ బాలరాజు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2025 | 10:58 PM