శోభాయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:25 PM
జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న జరిగే హనుమాన్ జయంతుత్సవాల శోభాయాత్రలు శాంతియుతంగా జరుపుకో వాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ కోరారు.

- శాంతి సంఘం సమావేశంలో ఎస్పీ యోగేష్‌గౌతమ్
నారాయణపేట, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా ఈనెల 12న జరిగే హనుమాన్ జయంతుత్సవాల శోభాయాత్రలు శాంతియుతంగా జరుపుకో వాలని ఎస్పీ యోగేష్‌గౌతమ్ కోరారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని ఉత్సవ కమిటీ సభ్యులు, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్, హిందూ మత పెద్దలతో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హనుమాన్ ఉత్సవాల సంద ర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు వలంటీర్లను నియమించుకొని ప్రజలకు, భక్తులకు ఇ బ్బంది కలుగకుండా చూడాలన్నారు. పోలీసుల అనుమతి పొంది శోభాయాత్రలు నిర్వహించు కోవాలన్నారు. గుండె జబ్బు, చిన్నారుల ఆరోగ్యా లను దృష్టిలో ఉంచుకొని డీజేలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. కేవలం లౌడ్ స్పీకర్లు, బ్యాండ్ల కు అనుమతిస్తామన్నారు. సోషల్ మీడియాలో ఒక మతాన్ని కించ పరిచే విధంగా పోస్టులు చేయొద్దన్నారు. శోభాయాత్రలో అలజడులు సృష్టి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ లింగయ్య, సీఐలు రాజేందర్‌రెడ్డి, సైదులు, బీజేపీ జిల్లా అద్యక్షుడు సత్యయాదవ్, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రాంబాబు, నందు నామాజీ, ప్రవీణ్, కన్నశివకుమార్, పోషల్ వినోద్, మురళీభట్టడ్ తదితరులున్నారు.