అన్నివార్డుల్లో ఎస్సీలకే పట్టం!
ABN , Publish Date - Dec 15 , 2025 | 11:37 PM
జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌లో అదృష్టం కలిసి వచ్చి అందరూ వార్డు సభ్యులు ఎస్సీ సామాజికవర్గం వారు ఎన్నిక కావడం విశేషం.
గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌లో విశేషం
గద్వాల, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం శెట్టిఆత్మకూర్‌లో అదృష్టం కలిసి వచ్చి అందరూ వార్డు సభ్యులు ఎస్సీ సామాజికవర్గం వారు ఎన్నిక కావడం విశేషం. గ్రామ సర్పంచు స్థానం అన్‌రిజర్వుడ్ జనరల్ స్థానం అయ్యింది. 10వార్డులు ఉండగా ఇందులో ఐదిం టిని ఎస్సీలకు, మిగిలిన ఐదింటిని జనరల్‌కు కేటాయించారు. బీసీలకు కేటాయించడానికి ని బంధనలు అడ్డువచ్చాయి. సర్పంచు స్థానంలో బీసీలు పోటీ చేశారు. భాగ్యలక్ష్మి సర్పంచుగా ఎ న్నికయ్యారు. వార్డుల కేటాయింపు సందర్బం గా ఎస్సీ కాలనీలోని ఓటర్లకు జనరల్ స్థానాలను కేటాయించారు. బీసీ కాలనీలోని ఓటర్లకు ఎస్సీ రిజర్వుడు స్థానాలను కేటాయించారు. దీం తో బీసీకాలనీలోని ఎస్సీ రిజర్వు స్థానాల్లో ఎస్సీలు వార్డుమెంబర్లుగా నామినేషన్లు వేశారు. ఎస్సీ కాలనీలోని జనరల్ స్థానాలకు వార్డులకు ఎస్సీ లు కూడా నామినేషన్ వేశారు. వారికి ఆ హక్కుఉంది. దీంతో బీసీలు, ఓసీలు ముందుకు రాలేదు. ఒక ఓసీ అభ్యర్థి నామినేషన్ వేసినా ఆయన ఓడిపోయారు. దీంతో మొత్తం పది వార్డులలో ఎస్సీ అభ్యర్థులు గెలుపొందారు. ఇది వారికి కలిసి వచ్చిన అవకాశం. జమ్మన్న అనే వ్యక్తిని ఉప సర్పంచుగా ఎన్నుకున్నారు.