గద్వాలలో కాషాయ జెండా ఎగరాలి
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:45 PM
ఎన్నికలు ఏవైనా గద్వాలలో బీజేపీ జెండా ఎగరాలని, అందుకోసం శ్రేణులంతా నిబద్ధతతో పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నుంచి భారీగా బీజేపీలో చేరికలు
గద్వాల టౌన్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు ఏవైనా గద్వాలలో బీజేపీ జెండా ఎగరాలని, అందుకోసం శ్రేణులంతా నిబద్ధతతో పనిచేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. ధరూరు, కేటిదొడ్డి, మల్దకల్, గద్వాల మండలాల నుంచి అధికా ర కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలకు చెంది న దాదాపు 300 మందికి పైగా నాయకులు, కా ర్యకర్తలు బుధవారం బీజేపీలో చేరారు. స్థానిక డీకే బంగ్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలను కప్పి నాయకులను ఎంపీ ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడిన డీకే అరుణ, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి నమ్మకంతో అధికారం అప్పగించినా, ఆ పార్టీ పాలన ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.