పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:18 PM
పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.
బైక్ ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాల క్రైం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మ రణ దినాన్ని పురస్కరించుకొని ప్లాగ్‌డే ఈవెంట్‌లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్, బీచుపల్లి 10వ బెటాలియన్ పోలీసులు సం యుక్తంగా నిర్వహించిన బైక్‌ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయంలో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఎస్పీ బైక్ నడిపి పోలీసులను ఉత్సాహపరిచారు. ర్యాలీలో అదనపు ఎస్పీ శంకర్, బీచుపల్లి 10వ బెటాలియన్ కమాండెంట్ జయరాజ్, డీఎస్పీ మొగిలయ్య, సాయుధ దళ డీఎస్పీ నరేందర్‌రావు తదితరులు ఉన్నారు.