పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:29 PM
పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమ ని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు.
- ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
- జిల్లా కేంద్రంలో కొవ్వొత్తులతో ర్యాలీ
నాగర్‌కర్నూల్ క్రైం,అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి) : పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమ ని ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌రఘునాథ్ అన్నారు. నాగ ర్‌కర్నూల్ పట్టణంలో గురువారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తులతో ర్యాలీలో ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పోలీ స్ సిబ్బంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసులు తన ప్రాణాల ను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తు న్నారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీలు బుర్రి శ్రీనివాస్ యాదవ్, వెంకట్‌రెడ్డి, సీఐలు అశోక్‌రెడ్డి, మహేష్, శంకర్‌నాయక్, నాగార్జున, నాగరాజు, ఆర్‌ఎస్‌ఐ గౌస్‌పాషా, ప్రశాంత్, శివాజీ, ఎస్‌ఐలు గోవర్ధన్, గురుస్వామి, శ్రీనివాసులు సిబ్బంది పాల్గొన్నారు.