ఉపాధ్యాయుల పాత్ర కీలకం
ABN , Publish Date - Oct 19 , 2025 | 11:07 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయు లు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
- విద్యా ప్రమాణాలు మరింత పెంచాలి
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఉపాధ్యాయు లు కృషి చేయాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఏనుగొండ ఓం కన్వెషన్ హాల్‌లో నిర్వ హించిన పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా అధ్యక్షుడు మధన్‌మోహన్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమాజాభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకమని, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేదుకు నిరంతరం కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ మోహ న్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలపై ఉమ్మడి రాష్ట్రంలోనే పీఆర్టీయూ నిరం తరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. పీఆర్టీ యూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పుల గం దామోదర్‌రెడ్డి, సుంకరి భిక్షంగౌడ్ మా ట్లాడుతూ ఉపాధ్యా యుల పెండింగ్ స మస్యలు పరిష్కరించి, డీఏ విడుదల చేయాలన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మఽధన్‌మోహన్‌యాదవ్, సుధాకర్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు నా రాయణగౌడ్, గట్టు వెంకట్‌రెడ్డి, రఘురామ్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిమ్మారెడ్డి, జైపాల్‌రెడ్డి, రాజశేఖర్‌గౌడ్, అశ్వని చంద్రశేఖర్, రాఘవేందర్, సావిత్రమ్మ, సుజాత, కవిత, బాలుయాదవ్, అక్తర్‌హైమద్, విజా యనంద్‌రెడ్డి పాల్గొన్నారు.
సీనియర్ సిటిజన్లను స్ఫూర్తిగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ టౌన్ : ప్రతీ ఒక్కరు సీనియర్ సిటిజన్లను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రూ.10 లక్షలతో నిర్మించే సీనియర్ సిటిజన్ భవనాన్ని ప్రారంభించి, మాట్లాడారు. మునిసిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌కుమార్‌గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొ రేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ మాజీ కార్యదర్శి వినోద్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, సిరాజ్ ఖాద్రి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్లు గంజి వెంకట్రా ములు, తిరుమల వెంకటేష్, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు జగపతిరావు, ఉపాధ్యక్షుడు రాజసింహుడు, కార్యదర్శి నాగభూషణం, జా యింట్ సెక్రెటరీ గంగాధర్, సాయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.