ఎగసిన గంగ
ABN , Publish Date - Aug 12 , 2025 | 11:07 PM
మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ జడ్చర్ల క్రాస్ రోడ్డులోని సబ్ రోడ్డు వద్ద మంగళవారం పగిలింది. దాంతో నీళ్లు ఫౌంటేన్‌లా ఎగసిపడ్డా యి. పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై ఉన్న జాతీయ రహదారిపైకి నీళ్లు విరజిమ్మాయి. జాతీయ రహదారిపై, సబ్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది.
జడ్చర్లలో పగిలిన మిషన్ భగీరథ పైపులైను
ఫ్లైఓవర్ రహదారిపైకి విరజిమ్మిన నీళ్లు
జడ్చర్ల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్ జడ్చర్ల క్రాస్ రోడ్డులోని సబ్ రోడ్డు వద్ద మంగళవారం పగిలింది. దాంతో నీళ్లు ఫౌంటేన్‌లా ఎగసిపడ్డా యి. పక్కనే ఉన్న ఫ్లైఓవర్‌పై ఉన్న జాతీయ రహదారిపైకి నీళ్లు విరజిమ్మాయి. జాతీయ రహదారిపై, సబ్‌రోడ్డులో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. నీళ్లన్నీ రో డ్డుపై వృథాగా పోయాయి. ఈ పైపులైన్ ద్వారా జడ్చర్ల, రా జాపూర్, బాలానగర్, నవాబ్‌పేట మండలాల్లోని గ్రామాలకు నీరు సరఫరా అవుతుంది. నీళ్లు వృథాగా పోతున్నా స రఫరాను ఆపేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారని, గంట తర్వాత సరఫరా బంద్ చేశారని స్థానికులు ఆరోపించారు.