ఇళ్ల నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2025 | 11:40 PM
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆ దేశించారు.
వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇంకా నిర్మాణాలు ప్రారంభించని లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చే యాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆ దేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ ఇళ్లతో స హా తదితర అంశాలపై కలెక్టర్ అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఎంపీడీవోలతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ... ముఖ్యంగా మునిసి పాలిటీల్లో చాలా నెమ్మదిగా గ్రౌండింగ్ సాగుతోం దని ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించా రు. వార్డు ఆఫీసర్లతో లబ్ధిదారులందరినీ పిలిపిం చి గ్రౌండ్ చేసుకునే విధంగా వారికి అవగాహన కల్పించాలన్నారు. ఎంపీడీవోలు ఏపీఎంలతో స మన్వయం చేసుకుని లబ్ధిదారులకు స్వయం స హాయక బృందాల ద్వారా రుణాలు ఇప్పించే ఏ ర్పాటు చేయాలన్నారు. వర్షాలు కురుస్తున్న నేప థ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా మునిసిపాలిటీలు, గ్రామాల్లో డ్రై డే ఫ్రైడే కార్య క్రమాలు చురుగ్గా నిర్వహించాలన్నారు. ఇటీవ ల డెంగీ కేసులు నమోదైన ప్రాంతాల్లో పరిస రాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని తెలిపా రు. మునిసిపాలిటీలు, గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు వారానికి ఒకసారి లేదా పది రోజుల కు ఒకసారి శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. అదే విధంగా ఎంపీడీవోలు అందరూ తమ పరిధిలోని సంక్షేమ గురుకుల వి ద్యా సంస్థలను ఆకస్మికంగా తనిఖీలు చేయాల న్నారు. అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటి ని తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో ఉమాదేవవి, హౌసింగ్ డీఈ విఠోబా, డీడబ్ల్యూవో సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ దరఖాస్తులు పరిష్కరించాలి
భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్లో క లెక్టర్, అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్‌తో కలిసి తహసీల్దార్‌లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... భూ భారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన పెండింగ్ దరఖాస్తు ల పరిష్కారం త్వరగా పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఇవే కాకుండా భూ భారతి రెవెన్యూ స దస్సులో వచ్చిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కా రం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవే కాకుండా భూ భారతి సాధారణ దరఖాస్తులపై కూడా దృష్టి సారించాలన్నారు.