Share News

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు ఆగం

ABN , Publish Date - Sep 09 , 2025 | 11:03 PM

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామీణ ప్రాంతాల నిరుపేద ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఆగమయ్యారని ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు.

పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో పేదలు ఆగం
వెల్కిచర్లలో గ్రామ పంచాయతీభవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

- ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

భూత్పూర్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో గ్రామీణ ప్రాంతాల నిరుపేద ప్రజలు సంక్షేమ పథకాలు అందక ఆగమయ్యారని ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్‌ మండల, మునిసిపాలిటీ పట్టణ అధ్యక్షుడు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌గౌడ్‌ అధ్యక్షతన మండలంలోని తాటిపర్తిలో అంగన్‌వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే విధంగా పెద్దతండా నుంచి లోక్యితండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. అక్కడి నుంచి వెల్కిచర్లలో పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, గ్రామంలో అంగన్‌వాడీ భవనం, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. భూత్పూర్‌ మునిసి పాలిటీపరిధిలోని అమిస్తాపూర్‌లో నాబార్డు, మైక్రో ఎంటర్‌ ప్రైజెస్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత కుట్టుమిషన్‌ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. మునిసిపాలిటీ స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకు ద్వారా మంజూరైన రూ.3.25 కోట్ల చెక్కును ఎమ్మెల్యే అందించారు. అంతకుముందు వెల్కిచర్ల ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబ పాలనలో పేదల సొత్తును దోచుకొని మూట కట్టుకున్నారని విమర్శించారు. ఆయా కార్యక్రమంల్లో మాజీ ఎంపీపీ కదిరే శేఖర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటనర్సిహ్మారెడ్డి, యువజన అధ్యక్షుడు భూపతిరెడ్డి, నాయకులు పల్లెరాంరెడ్డి, వెల్కిచర్ల గ్రామ అధ్యక్షుడు పర్వతాలు, వేణయ్యశెట్టి, సురేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ హర్యానాయక్‌, మలిశెట్టి వెంకటేష్‌, అమిస్తాపూర్‌ పవన్‌కుమార్‌, తహసీల్దార్‌ కిషన్‌, ఎంపీడీవో శ్రీదేవి, డీఈఈ లక్ష్మాయ్యగౌడ్‌, మునిసిపల్‌ కమిషనర్‌ నురూల్‌ నజీబ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 11:03 PM