Share News

గులాబీ జెండా ఎగరాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 11:21 PM

ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పట్ల రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, మళ్లీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌దే అధికారమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో నిర్వహించనున్న పాలమూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

గులాబీ జెండా ఎగరాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌గౌడ్‌

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి

పోలీసులు అతిగా వ్యవహరించొద్దు

కార్యకర్తల సమావేశంలో మాజీమంత్రి శ్రీనివా్‌సగౌడ్‌

మహబూబ్‌నగర్‌, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ప్రజల్లో బీఆర్‌ఎస్‌ పట్ల రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందని, మళ్లీ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌దే అధికారమని మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ ధీమా వ్యక్తం చేశారు. త్వరలో నిర్వహించనున్న పాలమూరు కార్పొరేషన్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోటీ చేసేందుకు పార్టీ టికెట్‌ ఎవరికి ఇచ్చినా అతని విజయం కోసం కార్యకర్తలు పని చేయాలని కోరారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో నగరానికి చెందిన ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి, స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. బీసీలను మరోసారి మోసం చేయాలని కాంగ్రెస్‌ చూస్తోందన్నారు. మహబూబ్‌నగర్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించామని, ఆ ప నులు పూర్తి చేస్తే బీఆర్‌ఎ్‌సకు పేరు వస్తుందని, కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. పోలీసులు అతిగా వ్యవహరించొద్దని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న వి షయాన్ని గుర్తించుకోవాలన్నారు. తమ కార్యకర్తలపై అనవసరంగా కేసులు బనాయిస్తున్నారని, వారిని కంటికిరెప్పలా కాపాడుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇప్పటికే ప్రభుత్వ మోసం ఏంటో అర్థమైంద ని, స్థానిక ఎన్నికల్లో ఈ విషయాన్ని చూయిస్తారని చెప్పారు. సమావేశంలో నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, కోరమోని నర్సింహులు, గంజి ఎంకన్న, శివరాజు, బెక్కం జనార్దన్‌, తాటి గణేష్‌, రహమాన్‌, అనంతరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 11:21 PM