గులాబీ జెండానే ఎగరాలి
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:24 PM
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండానే ఎగరాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు.
- పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
గండీడ్/ మహమ్మదాబాద్, అక్టోబరు 6 (ఆంద్రజ్యోతి) : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ జెండానే ఎగరాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలో ఉమ్మడి మండల బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలు ప్రజలకు ఇంకా బాకీ ఉన్నారని, బాకీ కార్డును ప్రదర్శించారు. ఇచ్చిన హామీల అమలులో విఫలమైనందున స్థానిక ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే నైతికతను వారు కోల్పోయారని, ఈ ఎన్నికల్లో ప్రజలు అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. అన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపునకు కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలన్నారు. మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, భిక్షపతి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ సంస్థ చైర్మన్ గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు వెంకటరామిరెడ్డి, రాజు, సునిత, నాయకులు రాంచంద్రారెడ్డి, రమేష్‌రెడ్డి పాల్గొన్నారు.