Share News

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:48 PM

ప్రేమ, దయ, కరుణ, శాంతి, మానవీయత కోసం తన జీవితాన్ని త్యాగం చే సిన ఏసుక్రీస్తు చూపిన మార్గం నేటి సమా జానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం
గద్వాల ఎంబీ మిస్బా చర్చిలో కేక్‌ కట్‌ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి

  • ఎంబీ మిస్బా చర్చిలో క్రిస్మస్‌ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే

  • కేక్‌ కట్‌ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు

గద్వాల టౌన్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రేమ, దయ, కరుణ, శాంతి, మానవీయత కోసం తన జీవితాన్ని త్యాగం చే సిన ఏసుక్రీస్తు చూపిన మార్గం నేటి సమా జానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. క్రిస్మస్‌ సందర్భంగా గురువారం పట్టణంలోని ఎంబీ మిస్బా చర్చిలో పాస్టర్లతో కలిసి ఎమ్మెల్యే కేక్‌ కట్‌ చే శారు. క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్‌, ముని సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మురళి, శ్రీను ముదిరాజ్‌, నరహరిగౌడ్‌, రాధాకృష్ణారెడ్డి, మధు, మోబిన్‌, అన్వర్‌, మన్యం ఉన్నారు. ఎంబీ మిస్బా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకల్లో జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత పాల్గొన్నారు. క్రిస్టియన్‌ మహిళలు, చి న్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Dec 25 , 2025 | 11:48 PM