తిరుమల చేరిన గద్వాల జోడు పంచెలు
ABN , Publish Date - Aug 28 , 2025 | 11:30 PM
తిరుమల తిరుపతి వెంకన్నకు గద్వాల జోడు పంచెలు చేరాయి. గద్వాల రాజవంశీయులు దశాబ్దాల కాలంగా అందజేస్తున్న ఈ జోడు పంచెలను కృష్ణ రాంభూపాల్ గురువారం తిరుమలలో స్వామి ఎదుట ఆలయ ఈవోకు అందించారు.
- ఈవోకు అందించిన రాజవంశీయులు
గద్వాల, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి వెంకన్నకు గద్వాల జోడు పంచెలు చేరాయి. గద్వాల రాజవంశీయులు దశాబ్దాల కాలంగా అందజేస్తున్న ఈ జోడు పంచెలను కృష్ణ రాంభూపాల్ గురువారం తిరుమలలో స్వామి ఎదుట ఆలయ ఈవోకు అందించారు. గద్వాల సంస్థానం ఏర్పడినప్పటి నుంచి వారి ఇష్టదైవంగా వేంకటేశ్వర స్వామిని కొలిచేవారు. కాగా గద్వాల జరీ చీరలకు ప్రాచుర్యం ఉండటం టీటీడీ వారు బ్రహ్మోత్సవాల సందర్బంగా స్వామికి ధరింప చేసే పంచెలను అందించాలని గద్వాల సంస్థానాన్ని కోరారు. అప్పటి నుంచి స్వయంగా వారే గద్వాల జోడు పంచెలను అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేసిన మగ్గంపై నైపుణ్యం కలిగిన కళాకారులు 41రోజుల పాటు నిష్టతో గోవిందనా మ స్మరణం చేస్తూ తయారు చేస్తారు. గద్వాల సంస్థానం ప్రస్థానం ముగిసిన వారి వంశీయులు మా త్రం ఇచ్చిన మాట ప్రకారం జోడు పంచెలను ఏటా బ్రహ్మోత్సవాల సం దర్భంగా అందిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కృష్ణరాంభూపాల్ అందించా రు. సెప్టెంబర్ 23న స్వామివారికి ఏరువాడ జోడు పంచెల అంకురార్పణం, 24న అఖిలాండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబ రు 2న బ్రహ్మోత్సవాల మొదటి రో జు స్వామి వారికి ధరింప చేస్తారు.