1 నుంచి ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం
ABN , Publish Date - Dec 31 , 2025 | 10:58 PM
జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం గా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.
బాలకార్మిక వ్యవస్థపై కఠిన చర్యలు
జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
గద్వాలక్రైం, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యం గా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 12వ ఆపరేషన్ స్మైల్ కోఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రెండు ప్రత్యేక పోలీస్ బృందాలు ఫీల్డ్‌లోకి వెళ్లనున్నాయన్నారు. ఈ బృందాలతో పాటు డీడబ్ల్యూవో, సీడబ్ల్యూసీ, డీఎల్‌వో తదితర శాఖల అధికారు లు కూడా సమన్వయంతో పనిచేస్తారన్నారు. పనుల్లో గుర్తించిన బాల,బాలికలను షెల్టర్ హోంలకు తరలిస్తామన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే కేసులు నమోదు చేస్తామన్నారు. బాలల భవిష్యత్తు పరిరక్షణే ఆపరేషన్ స్మైల్ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మొగులయ్య, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ సహదేవుడు, సభ్యులు శైలజ, డీసీపీవో నరసింహ, సీడీపీవో దీప్తి, ఆర్డీవో కార్యాలయ ఏవో వెంకటస్వామి, జీసీడీవో అంపయ్య, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రాజు, సంబంధిత అధికారులు ఉన్నారు.