జీవకోటి మనుగడకు మట్టే ఆధారం
ABN , Publish Date - Dec 05 , 2025 | 11:15 PM
సృష్టిలోని జీవరాశులన్నింటికీ మూలాధారం మట్టి అని, నేల సంరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా గు ర్తించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా
ఘనంగా ప్రపంచ మట్టి దినోత్సవం
గద్వాల టౌన్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): సృష్టిలోని జీవరాశులన్నింటికీ మూలాధారం మట్టి అని, నేల సంరక్షణను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా గు ర్తించాలని ప్రిన్సిపాల్ డాక్టర్ షేక్ కలందర్ బాషా అన్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ మట్టి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లా డిన ప్రిన్సిపాల్, మట్టికి ఉన్న ప్రాముఖ్యత, భూమి సంరక్షణ, పర్యావరణం పరిరక్షణలో నేలకు ఉండే ప్రాధాన్యత గురించి వివరించారు. కళాశాల ఏకో క్లబ్ కన్వీనర్ డాక్టర్ ఎస్. కరుణాకర్ మాట్లాడుతూ ప్రతీ జీవి ఆవిర్భవానికి, జీవ మనుగడ సాగించేందుకు మూలంగా ఉన్న మట్టిని కలుషితం చేయ డం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నట్లు వివరించారు. అభివృద్ధి పే రుతో ఏర్పడుతున్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు నేరుగా మట్టిలో కలిసిపోతుండటం అనేక సమస్యలకు దారి తీసిందన్నారు. అదే సమయం లో పంట దిగుబడులను పెంచే నెపంతో రైతులు విచ్ఛలవిడిగా వాడుతున్న రసాయనిక ఎరువులు సైతం నేలపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతున్నా యని అన్నారు. ఈ సందర్భంగా నేల సంరక్షణ, మట్టి పరిరక్షణ పేరుతో ప్రిన్సిపాల్, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ రాధిక, అధ్యాపకులు సత్యన్న, సత్తె మ్మ, వెంకటేశ్వరమ్మ, హరినాథ్, గణేశ్, భాస్కర్, పవన్‌కుమార్, హరిబాబు ఉన్నారు.