Share News

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

ABN , Publish Date - Sep 21 , 2025 | 11:15 PM

పాత పెన్షన్‌ విధానం అమలు చేసి, సీసీఎస్‌ను రద్దు చేయాలని సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞా అన్నారు.

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి
మాట్లాడుతున్న సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞా

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : పాత పెన్షన్‌ విధానం అమలు చేసి, సీసీఎస్‌ను రద్దు చేయాలని సీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞా అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శివం కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన సీపీఎస్‌ రద్దుకై జిల్లా ఉద్యోగ ఉపాధ్యాయులు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు మెనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్‌ను రద్దు చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేసే వరకు పోరాటం ఆగదని, ఉద్యోగులంతా ఏకమైతేనే సమస్య పరిష్కాం అవుతుందన్నారు. 2004 నుంచి అమల్లోకి తెచ్చిన పీఎఫ్‌ఆర్‌డీఏ బిల్లు 2013 సెప్టెంబరులో పార్లమెంట్‌లో పాస్‌ చేయించుకున్నామన్నారు. రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌ మాట్లాడుతూ సీపీఎస్‌తో ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. జిల్లా కమిటీ అధ్యక్షుడు కేఎం చంద్రకాంత్‌, ప్రధానకార్యదర్శి రాఘవేందర్‌రెడ్డి, జేఏసీ నాయకుడు రాజీవ్‌రెడ్డి, కార్యదర్శి విజయ్‌కుమార్‌, నాయకులు గడ్డం వెంకటేష్‌, విజయ్‌, శ్రీకాంత్‌, గోపాల్‌, మురహరినాథ్‌, రాజు, సాయిచందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2025 | 11:15 PM