కొలువుదీరిన అమ్మవారు
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:46 PM
ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి విజయ దశమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే దేవీ శర న్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లాలో అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
- తొలిరోజు బాలాత్రిపుర సుందరీ అలంకరణలో భక్తులకు దర్శనం
భక్తిశ్రద్ధలతో ఊరూరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం
గద్వాల టౌన్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆశ్వయిజ శుద్ధ పాడ్యమి నుంచి విజయ దశమి వరకు తొమ్మిది రోజుల పాటు సాగే దేవీ శర న్నవరాత్రి ఉత్సవాలు సోమవారం జిల్లాలో అం గరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గద్వా ల పట్టణంలో జగన్మాత భిన్నరూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక కన్యకాపరమేశ్వరి ఆల యంలో ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ప్రతిని ధులు జెండాను ఎగురవేసి ప్రారంభించారు. స్థానిక భక్తమార్కండేయ, కుమ్మరి శాలివాహన సంఘం మండలం, అన్నపూర్ణేశ్వరి, కాళికాదేవి ఆలయాల్లో అమ్మవారు బాలాత్రిపుర సుందరీదే విగా పూజలందుకున్నారు. తాయమ్మ గుడిలో శ్రీలలితాదేవిగా, భద్రకాళీసమేత వీరభద్రస్వామి ఆలయంలో శైలపుత్రిగా, వాసవీ కన్యకాపరమే శ్వరి ఆలయంలో వాసవీమాత గిరిజాదేవి అ లంకారంలో విశేష పూజలందుకున్నారు. సా యంత్రం ఆలయాల్లో మహిళలు సామూహిక కుంకుమార్చనలు చేశారు.