‘పోషణా పక్షం’ను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:24 PM
పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న ‘పోషణా పక్షం’ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

- కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట టౌన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): పోషకాహార ప్రాముఖ్యతపై ఈనెల 22 వరకు నిర్వహించనున్న ‘పోషణా పక్షం’ కార్యక్రమాన్ని విజయవంతం చే యాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో పోషణా పక్షం వాల్‌పోస్టర్ ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోషణా పక్షం-2025 కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈనెల 8 నుంచి 22 వరకు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో అంగన్‌వాడీ కేంద్రం, ప్రాజెక్టుల పరిధిలో జిల్లా స్థాయిలో నాలుగు రకాల ప్రతిపాదిత నేపథ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అఽధి గమించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. గ్రామ స్థాయిలో ఉన్న నారాయణపేట, మక్తల్, మద్దూరు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 704 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపంతో బాధపడుతున్న వారిని గుర్తించి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహారం, ఇతర సేవలను పూర్తిగా వినియోగించుకునేలా అ వగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో జయ, సీడీపీవోలు వెంకటమ్మ, సరోజిని, వెంకటేశ్వరమ్మ, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.