Share News

నామినేషన్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 11:37 PM

రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తూ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు ఎన్నికల అధికారులకు సూచించారు.

నామినేషన్ల ప్రక్రియ సజావుగా చేపట్టాలి

  • జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు

వడ్డేపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహిస్తూ అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు ఎన్నికల అధికారులకు సూచించారు. సర్పంచు ఎన్నికల సందర్భంగా రెండవ రోజు అభ్యర్థులు ఆయా క్లస్టర్ల పరిధిలో నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం వడ్డేపల్లి మండల పరిధిలోని తనగ ల, కొంకల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను శిక్షణ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్‌కుమార్‌, రాజ్‌కు మార్‌తో కలిసి అదనపు కలెక్టర్‌ సందర్శించా రు. ఈ సందర్బంగా ఆయా క్లస్టర్లలో అధికారు లతో మాట్లాడిన అదనపు కలెక్టర్‌, దరఖాస్తు లు పూర్తి చేయడంలో అభ్యర్థులకు ఏమైనా సం దేహాలు ఉంటే వాటిని నివృత్తి చేయాలన్నారు. అదేవిధంగా ప్రశాంతంగా పోలింగ్‌ జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో ప్రజలను ప్రలోభ పెట్టి సర్పం చు పదవిని వేలం వేసే వారిపై చర్యలు తప్ప వని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివకుమార్‌, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో జ్యోత్స్న ఉన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 11:37 PM