Share News

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Dec 19 , 2025 | 11:34 PM

పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయాధి కారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.రవికుమార్‌ అన్నారు.

జాతీయ లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

  • మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి ఎస్‌. రవికుమార్‌

గద్వాల క్రైం, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌ కేసుల సత్వర పరిష్కారం కోసం ఈ నెల 21న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు జిల్లా సెషన్స్‌కోర్టు న్యాయాధి కారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ ఎస్‌.రవికుమార్‌ అన్నారు. శుక్రవారం జిల్లా న్యా యస్థానంలోని తమ ఛాంబర్‌లో అడిషనల్‌ సీ నియర్‌ సివిల్‌ న్యాయమూర్తి టి. లక్ష్మితో కలిసి జాతీయ లోక్‌ అదాలత్‌పై ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..లోక్‌ అదాలత్‌ ద్వారా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చనానరు. గద్వాలలోని న్యాయస్థాన ప్రాంగణంలో ఈనెల 21న ఉదయం 10 గంట ల నుంచి సాయంత్రం 5 వరకు జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించడం జరుగుతుందని, రాజీ పద్ధతిలో కాదలిచిన క్రిమినల్‌, అన్ని రకాల సివిల్‌, జాతీయ లోక్‌ అదాలత్‌లో పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. లోక్‌ అదాలత్‌లో కేసులను పరిష్కరించుకొని తమ సమయాన్ని, డబ్బను ఆదా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వివిధ కారణాలతో గాయపడి లో క్‌ అదాలత్‌కు రాలేని కక్షిదారులు కూడా ఆన్‌లైన్‌లో మాట్లాడి రాజీ కుదర్చుకోవడం జరుగుతుందన్నారు. జాతీయ న్యాసేవా సంస్ధ ప్రతిష్టాత్మకంగా ఈ లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో పేరుకుపోయిన పెండింగ్‌ కేసుల భారాన్ని తగ్గించడానికి విశేష కృషి చేస్తుందన్నారు.

Updated Date - Dec 19 , 2025 | 11:34 PM