Share News

హంతకులను శిక్షించాలి

ABN , Publish Date - Nov 16 , 2025 | 11:39 PM

వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కొంగళ్ల శివ(26)ను హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు.

హంతకులను శిక్షించాలి
రాస్తారోకో నిర్వహిస్తున్న మృతుడి బంధువులు

- బంధువుల రాస్తారోకో

కల్వకుర్తి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన కొంగళ్ల శివ(26)ను హత్య చేసిన దుండగులను వెంటనే గుర్తించి శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ బంధువులు జాతీయ రహదారిపై రా స్తారోకో నిర్వహించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు మృతుని బంధువులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తూ బాధిత కు టుంబానికి న్యాయం చేయాలని దుండగులను శిక్షించాలని పెద్ద ఎత్తున నినా దాలు చేశారు. న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్‌ చేశారు. రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయాయి. వెల్దండ ఎస్‌ఐ కురుమూర్తి ధర్నా చేస్తున్న మృతుడి బంధువులతో మాట్లాడారు. కొంగళ్ల శివ మృతిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి దోషులను గుర్తించి శిక్ష పడేలా చూస్తామని ఎస్‌ఐ హామీ ఇచ్చారు. అనంతరం ధర్నా చేస్తున్న మృతుని బంధువులు శాంతించారు.

Updated Date - Nov 16 , 2025 | 11:39 PM