Share News

మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:18 PM

మంత్రుల పర్యటనను విజయ వంతం చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

మంత్రుల పర్యటన విజయవంతం చేయాలి
రహదారి పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అధికారులు

- నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ బదావత్‌ సంతోశ్‌

వంగూరు, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మంత్రుల పర్యటనను విజయ వంతం చేయాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. గురువారం నాగర్‌ కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వగ్రా మమైనా కొండారెడ్డిపల్లిలో కలెక్టర్‌, ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ దేవసహాయం పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పను లను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో అధికారులతో స మీక్ష నిర్వహించారు. కొండారెడ్డిపల్లి అభివృద్ధికి ప్రభుత్వం రూ. 91.71 కోట్ల అం చనా వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రారం భోత్సవాలు, శంకుస్థాపనలకు మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, జూపల్లి కృ ష్ణారావు, వాకిటి శ్రీహరి ఈ నెల 29న వస్తున్నట్లు తెలిపారు. సమస్యలు రా కుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, పనుల పురోగతి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. పనుల నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతీ శాఖ అధికారి ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జనార్దన్‌రెడ్డి, వేమారెడ్డి, జొజ్జ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 25 , 2025 | 11:18 PM