వ్యక్తి దారుణ హత్య
ABN , Publish Date - Aug 23 , 2025 | 11:31 PM
భార్య విడిపోవడానికి కారణమణి ఓ వ్యక్తి వృద్ధుడ్ని దారుణ హత్య చేశాడు. భార్య లేక కొడుకులు, బిడ్డలు అందుబాటులో లేక చాలీచాలని జీవితంలో సొంత గ్రామంలో ఉండి బతుకుదెరువు కోసం చిన్నగా గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
- విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ వెంకటేశ్వరరావు
వనపర్తి రూరల్, ఆగస్టు 23 (ఆంధ్ర జ్యోతి): భార్య విడిపోవడానికి కారణమణి ఓ వ్యక్తి వృద్ధుడ్ని దారుణ హత్య చేశాడు. భార్య లేక కొడుకులు, బిడ్డలు అందుబాటులో లేక చాలీచాలని జీవితంలో సొంత గ్రామంలో ఉండి బతుకుదెరువు కోసం చిన్నగా గొర్రెల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ సందర్భంలోనే ఆ వ్యక్తి దారుణ హత్యతో ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఘటన వనపర్తి జిల్లా పాన్‌గాల్ మండలంలో చోటు చేసుకుంది. వనపర్తి పట్టణ కేంద్రంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో పాన్‌గల్ ఎస్సై శ్రీనివాసులు, సీఐ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు వి లేకరుల సమావేశంలో వెల్లడించారు. పాన్‌గ ల్‌కు చెందిన ఎనుముల కిష్టయ్య (68) అత ని భార్య గత పది సంవత్సరాల కిందట మృ తి చెందింది. తనకున్న ఒక మారుకుడు ఒక కూతురు బతుకుతెరువు కోసం ఇతర ప్రాం తాలకు వలస వెళ్లారు. కిష్టయ్య సొంత గ్రామంలో ఉండి గొర్రెల వ్యాపా రం చే స్తూ వచ్చిన కమిషన్‌తో జీవనాన్ని కొన సాగిస్తూ ఉండేవాడు. ఈ సందర్భంలో అదే గ్రామానికి చెం దిన గంగయ్య అనే వ్యక్తి పరిచయమ య్యాడు. గత కొంతకాలంగా గంగయ్య కిష్ట య్యను అదే సందర్భంలో గంగయ్య త మ్ము డు రాములు కూడా పరిచయమయ్యాడు. రా ములు, రాములు భార్య కిష్టయ్యతో స న్నితం గా ఉంటూ సరదాగా ఉండేవారు. గత రెండు సంవత్సరాల భార్య విడిపోయి అత్తగారింటికి వెళ్లింది. లేనిపోనీ మాయమాటలు చెప్పి భార్య విడిపోవడానికి కిష్టయ్యనే కారణం అని కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 20న మద్యం తాగి ఇంటికి వెళ్లాడు.. రాత్రి 11 గంటలు దా టిన తర్వాత అందరూ నిద్రిస్తున్న సమయం లో కృష్ణ ఇంటికి వెళ్లి నిద్రపోతున్న కిష్టయ్య తలపై పక్కనే ఉన్న పప్పుగుత్తితో దాడి చేసి, ఊపిరి ఆడకుండా చేశాడు. మృతి చెందాడని తెలిశాక కొంత నగదును తీసుకొని దాడి చే సిన పప్పుగుత్తిని పక్కనే ఉన్న పైపులైన్లో వేసి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు చుట్టుపక్కల ఉన్న ప్రజలు మృతి చెందిన కిష్టయ్యను చూ సి తన కుమారునికి సమాచారం అందించా రు. కుమారుడు శివ స్వగ్రామానికి వచ్చి మా నాన్న మృతికి కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పాన్‌గల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి విచారణ ముమ్మరం చేశారు. అనుమానం ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకొని వి చారించగా చేసిన నేరాన్ని రాములు ఒప్పుకు న్నాడు. అతడిని పలు సెక్షన్ల కింద కేసు న మోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయ న తెలిపారు.