కొడంగల్ సమగ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యం
ABN , Publish Date - Jul 11 , 2025 | 11:11 PM
కొడంగల్ నియోజకవర్గ సమా గ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి
మద్దూర్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కొడంగల్ నియోజకవర్గ సమా గ్రాభివృద్ధే ప్రధాన లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి తెలిపారు. రూ.3.51 కోట్లతో నాగిరెడ్డిపల్లి నుంచి వయా సి ద్ధేశ్వర ఆలయం - చింతల్‌గట్టు వరకు, రూ. 6కోట్లతో పెదిరిపాడ్ నుం చి దేశాయిపల్లి వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు, మద్దూర్ పోలీస్‌స్టేషన్ ప్రహరీ గోడ నిర్మాణానికి కాడా అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి శుక్రవా రం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రా బోయే రెండేళ్లల్లో నియోజకవర్గ రూపురేఖలు మారడం ఖాయమ న్నారు. కొడంగల్‌ను ఆదర్శ నియోజకర్గంగా తీర్చిదిద్దేంకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రూ.వెయ్యి కోట్ల నిఽధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు.
మార్కెట్ రోడ్డు కుదించాలని వినతి
మద్దూర్- చింతల్‌దిన్నె రోడ్డు అభివృద్ధిలో భాగంగా మద్దూర్ మార్కె ట్ లైన్ రోడ్డును 70ఫీట్లకు వేసిన మార్కింగ్‌పై 30 ఫీట్లకు కుదిం చాలని తిరుపతిరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ సంబంధిత అధికారులు, స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయం తీసు కోవాలని సూచించారు. నర్సింహ, రఘుపతిరెడ్డి, సంజీవ్, నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.