Share News

పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్‌

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:12 PM

నందిన్నె మాజీ సర్పంచు చిన్నభీమారాయుడు హత్యకేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని మంగళవారం సీఐ టంగుటూరి శ్రీను అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్‌
విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఐ శ్రీను

- హత్యకు రూ. 25 లక్షల సుఫారీ

- విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించిన సీఐ టీ శ్రీను

గద్వాల క్రైం, డిసెంబరు 24 (ఆంధ్ర జ్యోతి): నందిన్నె మాజీ సర్పంచు చిన్నభీమారాయుడు హత్యకేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని మంగళవారం సీఐ టంగుటూరి శ్రీను అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెల 21న మాజీ సర్పంచ్‌ చిన్నభీమరాయుడు హత్యకేసులో మిల్లు వీరన్నతో పాటు, కుర్వ సురేందర్‌(మిల్లు వీరన్న కు మారుడు), బోయ వీరన్న అలియాస్‌ గ బ్బర్‌ వీరన్న, డ్రైవర్‌ తెలుగు మధుబాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరి సుం కన్న, బైరి కేశన్న, ప్రభుస్వామి, హరిజన్‌ రాజేశ్‌లు నిందితులు. వీరిని అరెస్ట్‌ చేయ గా మిగిలిన ఈశ్వరయ్య గౌడు పరారీలో ఉన్నాడు. అతడ్ని క ర్నూల్‌ జిల్లాలో అరెస్ట్‌ చేసి విచారించగా ప లు విషయాలు బయటకు వచ్చాయి.బొలెరో వాహనంతో గుద్ది చం పేందుకు పథకం ప న్ని గత నెల 21న ధ రూర్‌ మండలం జాం పల్లి బస్టాండ్‌ సమీపంలో హత్యచేసి ప్ర మాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశా రు. అయితే హత్యకు కారకులైన వారు పోలీసులు ఎవరూ గుర్తుపట్టేందుకు ఉం డకుండా అందురూ కీబోర్డు ఉన్న మొబైల్స్‌నే వాడారు. తర్వాత భీమరాయుడును చంపడానికి ఈశ్వర్‌కు గతంలో పరిచ యం ఉన్న మధుబాబుకు రూ. 4 లక్షలు ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా మొత్తం ఈ హత్యకు సంబంధించి రూ. 25 లక్షలు సుఫారీ మాట్లాడుకొని హత్య చేశారు. తర్వాత హత్యచేసిన అనంతరం ఈశ్వర్‌గౌడు పరారీలో ఉన్నా డు. అతడిని కర్నూల్‌ జిల్లాలోని కాల్వబుగ్గ సమీపంలో బుధవారం పట్టుకొని అరెస్ట్‌ చేశాం. ఈ కేసులో ఇప్పటివరకు 11 మందిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ తెలి పారు. అతడి నుంచి ఒక బైక్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తర్వాత కోర్టులో హాజరు పర్చగా రిమాండ్‌కు తరలించారన్నారు. ఈ సమావేశంలో ధరూర్‌, కేటీదొడ్డి ఎస్‌ఐలు శ్రీహరి, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 24 , 2025 | 11:12 PM