మహాగర్జన సభను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Aug 16 , 2025 | 11:23 PM
వికలాంగులు, చే యూత పెన్షన్‌దారుల మహా గర్జన సభను జయప్రదం చేయాలని వీహె చ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు లు అన్నారు.
వనపర్తి టౌన్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి) : వికలాంగులు, చే యూత పెన్షన్‌దారుల మహా గర్జన సభను జయప్రదం చేయాలని వీహె చ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసు లు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లోని పాలిటెక్నిక్ కళాశాల మైదానం లో వీహెచ్‌పీఎస్, ఎమ్మార్పీఎస్ నా యకులు సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడారు. మహాగర్జన సభ సెప్టెంబరు 9న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ లో కొనసాగనుందని, ఈ మహా గర్జన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్, వీహెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హా జరవనున్నట్లు చెప్పారు. సమావేశంలో ఎమ్మా ర్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు చెన్నకేశవులు, గంధం గట్టయ్య మాదిగ, లక్ష్మయ్య, కృష్ణయ్య, శ్రీనివాసులు, కుమార్, శేఖర్, కృష్ణవేణి, తిరుప తి, పరశురాముడు, రమేష్, శాంతికుమార్ తది తరులు పాల్గొన్నారు.