Share News

తీరనున్న ఉపాధ్యాయుల కొరత

ABN , Publish Date - Nov 06 , 2025 | 11:22 PM

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనున్నది. ఆయా పాఠశాలల బోధకుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

తీరనున్న ఉపాధ్యాయుల కొరత
మద్దూర్‌ మండలం నిడ్జింత జడ్పిహేచ్‌ఎస్‌లో ఇన్‌స్టేక్టర్ల నియమకం గురించి ప్రిన్సిపల్‌ సెకరెట్రి యోగితారాణికి వినతి నిస్తూన్న పిఅర్‌టియూ నేతలు

- 320 మంది బోధకుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌

నారాయణపేట, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీరనున్నది. ఆయా పాఠశాలల బోధకుల నియామకానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు గురువారం జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి అందాయి. ప్రభుత్వం గత ఏడాది జూన్‌, ఈ ఏడాది అగస్టులో పలువురు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. దీంతో ఏర్పడిన ఖాళీల భర్తీకి బోధకులను నియమిం చాలని నిర్ణయించిన ప్రభుత్వం, అందుకు అనుగుణం గా ఉత్తర్వులు జారీ చేసింది.

పేట జిల్లాలో 429 పోస్టులు ఖాళీ

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా 2,323 ఉపాధ్యాయ పోస్టులకు గాను 1,894 మంది పని చేస్తున్నారు. పదో న్నతులతో 429 పోస్టులు ఖాళీ అయ్యాయి. 90 మంది సర్‌ప్లస్‌ టీచర్లు (విద్యార్థులు తక్కువ, ఉపాధ్యాయులు తక్కువ) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 337 ఉండగా, వాటిలో 18,096 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 86 ఉండగా, 9,989 మంది, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 75 ఉండగా, 22,319 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 112కు 112 మంది ఉన్నారు. ఎస్‌జీ టీలు 1,191 మందికి గాను, 860 మంది పని చేస్తున్నా రు. 331 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 1,038 గాను, 939 మంది పనిచేస్తున్నారు. 99 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జీహెచ్‌ఎంలు 63 మందికి గాను, 55 మంది పనిచేస్తుండగా, 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భాషా పండితులు 29 మందికి 29 మంది పనిచేస్తుండగా, పీటీ లు 8 మంది, పీడీలు 37 మంది విధుల్లో ఉన్నారు. వారిలో 76 మందిని సర్దు బాటు చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలలు 116 ఉండడంతో విద్యాబోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రత్యామ్మాయ్యంగా 320 మంది బోధకులను నియమించాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నియామకానికి చర్యలు తీసుకోవాలని జూలై 17న మద్దూర్‌ మండలం లోని నిడ్జింత జడ్పీహెచ్‌ఎస్‌కు వచ్చిన విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు పీఆర్‌టీయూ జిల్లా అధ్య క్షుడు యాదగిరి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యా యులు వినతి పత్రం సమర్పించారు.

Updated Date - Nov 06 , 2025 | 11:22 PM