న్యాయవాదుల కోరిక సముచితమైంది
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:26 PM
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మానవపాడు స్టేజీ వద్దకు రాగానే, సోమవారం మండలానికి చెందిన అఖిలపక్షం నాయకులు, న్యాయవాదులకు మద్దతు తెలిపారు.
ర్యాలీకి అఖిలపక్షం నాయకుల మద్దతు
మానవపాడు, నవంబరు10 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల రక్షణ చట్టం అమలు కోసం జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర మానవపాడు స్టేజీ వద్దకు రాగానే, సోమవారం మండలానికి చెందిన అఖిలపక్షం నాయకులు, న్యాయవాదులకు మద్దతు తెలిపారు. న్యాయవాదులు జాతీయ రహదారి 44పై రెండోరోజు పాదయాత్ర కొనసాగిస్తుండగా వారిని ఎమ్మెల్యే విజయు డు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జగన్ మోహన్ నాయుడు, బీజేపీ మండల అధ్యక్షుడు మురళి కలిసి తన మద్దతు తెలిపారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తక్షణమే అమ లులోకి తేవాలన్నారు.
బీఎస్పీ నాయకుల మద్దతు
ఇటిక్యాల : ఇటిక్యాల స్టేజీ వద్ద జాతీయ రహదారిపై పాదయాత్రగా వెళ్తున్న న్యాయవాదులకు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, ఉపా ధ్యక్షుడు మణికుమార్ కలిశారు. వారికి మద్దతు తెలిపారు.