Share News

అలం పూర్‌ నుంచి హైదరాబాద్‌

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:32 PM

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం అలంపూర్‌ బార్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు అలం పూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పాదయా త్రను ప్రారంభించారు.

అలం పూర్‌ నుంచి హైదరాబాద్‌
జోగుళాంబ దేవస్థానం వద్ద పాదయాత్రను ప్రారంభిస్తున్న న్యాయవాదులు

  • అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌ పాదయాత్ర ప్రారంభం

అలంపూర్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం అలంపూర్‌ బార్‌ అ సోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు అలం పూర్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పాదయా త్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయ వాదులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో న్యాయవాదులపై భౌతిక దాడులు నిత్యం ఏదో ఒకచోట జరుగుతున్నాయని అన్నారు. న్యాయ వాదుల రక్షణ చట్టం కోసం పాదయాత్రను చేపట్టామని, ఈ పాదయాత్ర దాదాపు పది రోజులపాటు కొనసాగుతుందని తెలిపారు. అలాగే న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని, జూనియర్‌ న్యాయవాదులకు రూ.5 వేలు స్టైఫండ్‌ ఇవ్వాలని, సీఆర్పీసీ సెక్షన్‌ 41(ఏ) బీఎన్‌ఎస్‌ సెక్షన్‌35(1) అమైన్మెంట్‌ చే యాలని డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ చేరు కొని రాష్ట్ర గవర్నర్‌, ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జీ లకు తమ సమస్యలు విన్నవించి, వినతి పత్రాలుఅందజేస్తామని తెలిపారు. అంతకుముందు జోగుళాంబ బాల బ్రహ్మే శ్వరస్వామి వార్లను దర్శించుకొని పాదయాత్ర ప్రారంభించారు. కార్యక్రమంలో అలంపూర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గవ్వల శ్రీనివా సులు, ప్రధాన కార్యదర్శి నరసింహులు, నారా యణరెడ్డి, తిమ్మారెడ్డి, శ్రీధర్‌రెడ్డి, గజేంద్ర గౌడ్‌, ఆంజనేయులు, మధు, వెంకటేష్‌, హేమంత్‌ యాదవ్‌, యాకూబ్‌, నాగయ్య, రవికుమార్‌ మద్దతు ప్రకటించిన న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:36 PM