Share News

రేపటి నుంచి లాంచి ప్రయాణం షురూ

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:29 PM

తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతం గా ప్రసిద్ధిగాంచిన సోమశిల కృష్ణానది మీదుగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏసీ లాంచి ప్రయాణం రేపటి నుంచి ప్రారం భించనున్నారు.

రేపటి నుంచి లాంచి ప్రయాణం షురూ
సోమశిల వద్ద కృష్ణానదిలో పర్యాటకుల కోసం సిద్ధంగా ఉన్న ఏసీ లాంచి

కొల్లాపూర్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతం గా ప్రసిద్ధిగాంచిన సోమశిల కృష్ణానది మీదుగా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ఏసీ లాంచి ప్రయాణం రేపటి నుంచి ప్రారం భించనున్నారు. ఎగువ ప్రాంతాలలో భా రీగా కురుస్తున్న వర్షాల కారణంగా కృ ష్ణానది జలకళను సంతరించుకుంది. ప ర్యాటకులు కృష్ణానది అందాలను ఆస్వా ధించేందుకు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో సోమశిల-శ్రీశైలం పుణ్యక్షే త్రానికి ఏసీ లాంచి నడుపనున్నట్లు తె లంగాణ టూరిజం జిల్లా అధికారి కల్వ రాల నరసింహ తెలిపారు. సోమశిల గ్రామం నుంచి ప్రతీ మంగళవారం, గు రువారం, శనివారం రోజు ఉదయం 9 గంటలకు లాంచి బయలుదేరి 7 గంట ల వ్యవధిలో శ్రీశైలం సమీపంలో ఉన్న ఈగలపెంట పాతాళగంగ వెనుకభాగం లో పర్యాటకులను దింపుతుంది. తిరి గి ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం మూడు రోజుల పాటు అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4 గంటలకు సోమశిల గ్రా మం కృష్ణానది పుష్కర ఘాట్ల వద్దకు పర్యాటకులను చేరవేస్తోంది.

ఏసీ లాంచి ప్రయాణ చార్జీలు

సోమశిల నుంచి శ్రీశైలం వరకు ఏసీ లాంచీలో కృష్ణానది మీదుగా ప్రయాణిం చే పర్యాటకులు తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు రూ.1600 నిర్ణయించారు. ఈ ఛార్జీలోనే పర్యాటకులకు భోజనం, టీ, స్నాక్స్‌ అందజేస్తారు.

Updated Date - Aug 17 , 2025 | 11:29 PM