గెలుపు సంతోషం.. అంతలోనే విషాదం
ABN , Publish Date - Dec 11 , 2025 | 11:54 PM
నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొం డ మండలంలోని జకినాలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కదిరే శేఖర్‌యాదవ్‌కు గురువారం పితృవియోగం కలిగింది.
- నూతన సర్పంచ్‌కు పితృవియోగం
ఊర్కొండ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొం డ మండలంలోని జకినాలపల్లి సర్పంచ్‌గా ఎన్నికైన కదిరే శేఖర్‌యాదవ్‌కు గురువారం పితృవియోగం కలిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. అభ్యర్థి శేఖర్‌యాదవ్ తండ్రి కదిరే సాయిలు (65) ఐదు రోజుల క్రి తం ట్రాక్టర్ డ్రైవర్ నడుపుతుండగా ఇంజన్‌పై కూర్చొని పొలం నుంచి ఇం టికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పపహాడ్-జకినాలపల్లి రోడ్డులో బ్రిడ్జి వ ద్ద డ్రైవర్ సడన్‌బ్రేక్ వేయడంతో సాయిలు కిందపడ్డాడు. కుటుంబ స భ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అంది స్తుండగా, గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఎన్నికల్లో పోటీ లో కుమారుడు ఉండటంతో ఎన్నికల ప్రక్రియకు ఇబ్బంది కలుగకూడదన్న ఉద్దేశంతో మృతి చెందిన విషయం కుటుంబ సభ్యులు చెప్పలేదు. అయితే, హైదరాబాద్ నుంచి మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చారు. దీంతో గెలి చిన సంతోషంలో ఉన్న అభ్యర్థితో పాటు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకు లు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.