కొత్తది కొన్న సంతోషం.. అంతలోనే విషాదం..
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:48 PM
ట్రాక్టర్ కొన్న సంతోషాన్ని ఆస్వాదించేలోపే ఆ కుటుంబంలో విషాదం నిండింది. మహబూబ్‌న గర్ జిల్లా, జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది.
- ట్రాక్టర్ కింద పడి 5ఏళ్ల బాలుడు మృతి
- చిన్న ఆదిరాలలో ఘటన
జడ్చర్ల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : ట్రాక్టర్ కొన్న సంతోషాన్ని ఆస్వాదించేలోపే ఆ కుటుంబంలో విషాదం నిండింది. మహబూబ్‌న గర్ జిల్లా, జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం ఈ విషాద సంఘటన జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్ర కారం.. చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన అల్లాపురం ఆంజనేయులు వారం రోజుల క్రితం కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. వ్యవసాయ ప నుల్లో భాగంగా ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ట్రా క్టర్‌పై పొలానికి వెళ్లాడు. కుటుంబ సభ్యులు అందరూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా, ట్రాక్టర్‌పై కూర్చున్న ఆంజనేయులు కుమారుడు చింటూ (5) ఇంజన్‌కు ఉంచిన ఇగ్నిషన్స్ కీని స్టార్ట్ చే శాడు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందు కదలడంతో బాలుడు దా ని కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై తమ కు ఫిర్యాదు అందలేదని జడ్చర్ల పోలీసులు తెలిపారు.