అమాయకులే లక్ష్యం
ABN , Publish Date - Oct 23 , 2025 | 11:47 PM
ఏటీఎం కేంద్రాల వద్ద అ మాయకులను ఆసరాగా చేసుకొని మోసగిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మ హబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీసులు తెలిపారు. గురువారం ఎస్ ఐ శేఖర్‌రెడ్డి నిందితుడిని విలేకరుల ఎదుట ఉంచి వివరాలను వెల్లడించారు.
-ఏటీఎం కార్డులు ఏమార్చి.. డబ్బులతో జల్సాలు
మహమ్మదాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ఏటీఎం కేంద్రాల వద్ద అ మాయకులను ఆసరాగా చేసుకొని మోసగిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మ హబూబ్‌నగర్ జిల్లా మహమ్మదాబాద్ పోలీసులు తెలిపారు. గురువారం ఎస్ ఐ శేఖర్‌రెడ్డి నిందితుడిని విలేకరుల ఎదుట ఉంచి వివరాలను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కావలి చెన్నయ్య జల్సాలకు అలవాటుపడి ఏటీఎం కేంద్రాల వద్ద అమాయకులను ఆ సరా చేసుకుని సహాయం చేస్తున్నట్లు నటించేవాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న వేరే ఏటీఏం కార్డులను మార్చి ఇచ్చి అసలు కార్డు ద్వారా వారి డబ్బుల ను డ్రా చేసుకునేవాడు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్‌లో పని చేస్తున్న శంకరయ్య కార్డు మార్చి రూ.57,800, బొమ్బి కుంటతండాకు చెందిన రవి కార్డు ద్వారా రూ.30వేలు, సెప్టెంబరు 8న లిగా యిపల్లితండాకు చెందిన వ్యక్తి కార్డు ద్వారా రూ.28,500 డ్రా చేశాడు. ఇతనిపై గతంలో మహబూబ్‌నగర్ టూటౌన్, కొడంగల్, కుల్కచర్ల పోలీస్‌స్టేషన్ల పరిధి లో మూడు కేసులు నమోదయ్యాయని తెలిపారు. అతని నుంచి ఒక బైక్, రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.