పెంచిన పెన్షన్‌ను వెంటనే అమలు చేయాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 10:54 PM
దివ్యాంగులకు పెంచిన పెన్షన్‌ను వెంటనే అమలు చేసేలా చూడాలని, ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ది వ్యాంగులు సోమవారం ధ ర్నా నిర్వహించారు.
- జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ వద్ద దివ్యాంగుల ధర్నా
గద్వాలన్యూటౌన్, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులకు పెంచిన పెన్షన్‌ను వెంటనే అమలు చేసేలా చూడాలని, ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు ది వ్యాంగులు సోమవారం ధ ర్నా నిర్వహించారు. ఈ సం దర్బంగా జిల్లా దివ్యాంగుల సేవా సంఘం అధ్యక్షుడు టెంకాయల చంటి మాట్లాడుతూ జిల్లా దివ్యాంగుల సేవా సంఘం వికలాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో మం దకృష్ణ పిలుపుమేరకు దివ్యాంగులకు రూ.4వేల నుంచి రూ.6వేలు వెంటనే పెంచాలన్నారు. అ లాగే వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు రూ.4వేలకు పెంచాలన్నారు. అలాగే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతీ ఒక్కరికి నూతన పెన్షన్లు మంజూరు చేయాలన్నారు దివ్యాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ అదనపు కలెక్టర్ నర్సింగరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీశ్‌మాదిగ, మహేశ్, వీహెచ్‌పీఎస్ నా యకులు బి.కె. నర్సింహ, సుభాన్‌బాష, హరీఫ్, దివ్యాంగుల సేవాసంఘం సభ్యులు జయంతు డు, కృష్ణ, వెంకటేశ్, మంజుల, రమేశ్, ఎలీషా, దండో రా భాస్కర్, యోసుబు, గోపి ఉన్నారు.