Share News

పెంచిన వంటగ్యాస్‌ ధర వెంటనే తగ్గించాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:33 PM

కేం ద్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం పెంచిన వం టగ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం జి ల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.

పెంచిన వంటగ్యాస్‌ ధర వెంటనే తగ్గించాలి

- సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసనలు

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): కేం ద్ర ప్రభుత్వం రెండురోజుల క్రితం పెంచిన వం టగ్యాస్‌ ధరలు వెంటనే తగ్గించాలని సీపీఎం జి ల్లా కార్యదర్శి వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వ పాలకులకు గ్యాస్‌ ధరల పెంపు వల్ల మహిళలకు కష్టాలు ఉంటాయన్న విష యం తెలియా అంటూ నిలదీశారు. వంటగ్యాస్‌ ధరల పెంపుకు వ్యతిరేకంగా బుధవారం పట్ట ణంలోని పాతబస్టాండ్‌ సర్కిల్‌లో గ్యాస్‌ సిలిండ ర్లను ఉంచి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకటస్వామి, 2004 నుంచి అం తర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టగా, ప్రస్తుతం అవి మరింత త గ్గిన తరుణంలో గృహ వినియోగ సిలిండర్‌పై రూ.50లు పెంచడం శోఛనీయమన్నారు. గ్యాస్‌ ధర పెంపు వల్ల ఒక్కరోజు జిల్లా వినియోగదా రులపైనే సగటున రోజున రూ.15లక్షలకుపైగా భారం పడనుందన్నారు. ఒకవైపు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజలు నానాఅ వస్థలు పడుతుండగా ఉద్యోగ, ఉపాధి, అవకాశా లు పెంచి ఆదుకోవాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం సిగ్గుచేటన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు, వి నియోగదారులు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలు పునిచ్చారు. ఉప్పేరు నరసింహ, చందు, నరేశ్‌, నందు, హరి, గోవిందు, పరశురాముడు, టి.నరే శ్‌, ఆనంద్‌, వీరేశ్‌ ఉన్నారు.

వివేకానంద సర్కిల్‌లో నిరసన

ఉండవల్లి : పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరను తక్షణమే తగ్గించాలని సీఐటీయూ మండల నాయకుడు వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఉండవల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవా రం మండల కేంద్రంలోని వివేకానంద సర్కిల్‌ లో ఖాళీ సిలిండర్‌తో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు పెరిగిన నిత్యావసర ధరలు ప్రజలు స తమతమవుతుంటే కేంద్రం గ్యాస్‌ ధరను రూ.50 పెంచడం శోఛనీయమన్నారు. అంతర్జాతీయం గా ముడి చమురు ధరలు పెరగకపోయినా కా ర్పొరేట్‌ కంపెనీలకు లాభాలు చేకూర్చడమే ల క్ష్యంగా ప్రజలపై పెనుభారం మోపడం తగద న్నారు. కార్యక్రమంలో సీఐటీయూ మండల నాయకులు షేక్షావలి, నాగరాజు, అంజి, రాజు, సీతారాములు, నరసింహ ఉన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:33 PM