Share News

బడిని బలోపేతం చేయాలి

ABN , Publish Date - May 20 , 2025 | 11:22 PM

ప్రభుత్వ పాఠశాలలను బలోపే -తం చేయడంతో పాటు తరగతి గదుల్లో సాంకే తికతను జోడించి విద్యాభోదన చేస్తూ ఉపాధ్యా యులు ఆదర్శవంతం కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, పరిశీలకుడు, డైట్‌ లెక్చరర్‌ సిరాజుద్దీన్‌లు అన్నారు.

బడిని బలోపేతం చేయాలి
శిక్షణ శిబిరంలో డీఈవో గోవిందరాజులు

- విద్యా బోధనలో సాంకేతికతను జోడించాలి

- ఉపాధ్యాయులు ఆదర్శం కావాలి

- రెండో విడుత ఉపాధ్యాయ శిక్షణలో డీఈవో గోవిందరాజులు

నారాయణపేట/ధన్వాడ/దామరగిద్ద, మే 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపే -తం చేయడంతో పాటు తరగతి గదుల్లో సాంకే తికతను జోడించి విద్యాభోదన చేస్తూ ఉపాధ్యా యులు ఆదర్శవంతం కావాలని జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, పరిశీలకుడు, డైట్‌ లెక్చరర్‌ సిరాజుద్దీన్‌లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులకు జాజాపూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌, పేట గ్రౌండ్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మంగళవారం రెండో విడుత శిక్షణ శిబిరం ప్రారంభమైంది. శిబిరాన్నుద్ధే శించి వారు మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రేర ణాత్మకంగా ఉండడంతో పాటు, బాష బోధన లక్ష్యాలు, పాఠ్య ప్రణాళికల్లో నాణ్యమైన బోధనతో విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నారు. జీవన నైపుణ్యాలు, విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. ఐదురోజుల పాటు శిక్షణ కొనసాగుతుంద న్నారు. జిల్లాలోని తెలుగు ఉపాధ్యాయులు 141 మంది, హిందీ 143 మంది, భౌతికం 168 మంది, జీవశాస్త్రం 127 మంది, సాంఘీక శాస్త్రం 56 మంది, ఇంగ్లిష్‌ 50 మంది, గణితం 54 మంది, ప్రధానోపాధ్యాయులు 68 మంది, వ్యాయామ ఉపాధ్యాయులు 68 మందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రిస్సిపల్‌ సెక్రటరీ యోగితారాణి, డైరెక్టర్‌ రమే ష్‌లు కాసేపు జూమ్‌ మీటింగ్‌లో ప్రధానోపాధ్యాయులతో చర్చించారు. కార్యక్రమంలో సీఎంవో రాజేంద్రకుమార్‌, ఏఎంవో విద్యాసాగర్‌, యాద య్యశెట్టి, భానుప్రకాష్‌ తదితరులున్నారు.

అదేవిధంగా, ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల శిక్షణను ఎంఈవో గాయత్రి ప్రారంభించి, మాట్లాడారు. వెనకబడిన విద్యార్థులను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులకు సూచించారు.

దామరగిద్దలోని ఎమ్మార్సీలో ఎంఈవో కృష్ణా రెడ్డి, కోర్సు డైరెక్టర్‌ మల్లికార్జున్‌లు ఉపాధ్యాయుల శిక్షణను ప్రారంభించి, మాట్లాడారు. ఉపాధ్యాయులు శంభులింగం, రిసోర్స్‌పర్సన్స్‌ హుసేనప్ప, గీత, రమేష్‌, మనోజ్‌, సాయప్ప, నరేష్‌, బాలాజీ, శంకర్‌, సీఆర్పీలు మహిపాల్‌, రాములు, నాగేందర్‌ తదితరులున్నారు.

Updated Date - May 20 , 2025 | 11:22 PM