Share News

అధికార హస్తం.. గులాబీ సాయం

ABN , Publish Date - May 01 , 2025 | 11:31 PM

అక్ర మ లేదా సక్రమ పనుల్లో సాధారణంగా ఏ నియోజకవ ర్గంలోనైనా అధికార పార్టీ నాయకులదే పైచేయి ఉంటుం ది.

అధికార హస్తం.. గులాబీ సాయం
ఇసుక అక్రమ రవాణా కోసం కృష్ణానదిలో వేసిన మట్టిరోడ్డు

- గుడెబల్లూరు వద్ద కృష్ణానది నుంచి ఇసుక రవాణాలో వింత పోకడలు

- అధికారులతో లాబీయింగ్‌ కోసం కృష్ణ మండల బీఆర్‌ఎస్‌ నాయకుడి సాయం

- నదిలో దర్జాగా రోడ్డు వేసి కర్ణాటకకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

- అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఎత్తుగడ

- హస్తం పార్టీలో పాత, కొత్త నాయకుల మధ్య ఇసుక రవాణాతో విభేదాలు

మహబూబ్‌నగర్‌, మే 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అక్ర మ లేదా సక్రమ పనుల్లో సాధారణంగా ఏ నియోజకవ ర్గంలోనైనా అధికార పార్టీ నాయకులదే పైచేయి ఉంటుం ది. వారి కనుసన్నల్లోనే దందాలు నడుస్తాయి.. ఏదైనా స మస్యలు వచ్చినప్పుడు వారికి అధినేత అభయహస్తం ఉం టుంది. కానీ నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజక వర్గంలో వింత పోకడలు కనిపిస్తున్నాయి. తమ పేర్లు బ యటకు రాకుండా ఉండటం కోసం అధికార పార్టీ నాయ కులే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ నాయకులను దందాలో చేర్చుకు ని పనులు చక్కబెట్టుకుంటున్న పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. ఇది చూసిన కొంతమంది హస్తం కార్యకర్తలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. కృష్ణానదిలో పైన ఉన్న భూములన్నీ నల్లరేగడి కావడంతో ఇక్కడ ఇసుక లభ్యత దాదాపు ఉండదు. కానీ నది పాయలుగా విడిపో యిన చోట, వేరే ఉపనదులు వచ్చి కలిసిన ప్రాంతాల్లో మాత్రం ఇసుక లభ్యత ఉంది. నారాయణపేట జిల్లా కృష్ణా మండలం గుడెబల్లూరు- ముడుమాల్‌ శివారులో మాత్రం ఇసుక లభ్యత భారీగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న నాయకులు గత ప్రభుత్వం నుంచే ఇసుక దందా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత కొద్దిరోజులు దందా ఆగినా.. ప్రస్తుతం య థేచ్ఛగా నడుస్తోంది. అర్ధరాత్రి వేళల్లో కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు మక్తల్‌, నారాయణపేట, కృష్ణ, మాగ నూరు మండలాలకు కూడా అక్రమంగా రవాణా చేస్తు న్నారు. వాస్తవానికి ఇక్కడ రీచ్‌ పెట్టి ఇసుక తవ్వకాలు చేపడితే ప్రభుత్వానికి ఆదాయమైనా వచ్చేది.. కానీ ఇప్పు డు ఎలాంటి అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతున్నా.. తమ దృష్టికి రాలేదని చెప్పి తప్పించుకుంటున్నారు. ఫొటోలతో పాటు వాస్తవాలు బయటపడుతున్నా.. కళ్లు ఉండీ కబోదిలా అధికారుల వ్యవహారశైలి ఉంటోంది.

దందా జరుగుతోందిలా...

కర్ణాటక నుంచి వచ్చే కృష్ణానది.. మహారాష్ట్ర నుంచి వచ్చే భీమా నది నారాయణపేట జిల్లా తంగిడిగి దత్త భీమేశ్వ రస్వామి ఆలయం వద్ద సంగమమవుతాయి. ఈ క్రమంలో కుసుమూర్తి, గురుజాల్‌, హిందూపూర్‌, గు డెబల్లూరు, ముడుమాల్‌ శివారుల్లో ఇసుక మేటలు ఏర్ప డతాయి. గుడెబల్లూరు- ముడుమాల్‌ శివారులోని ముర హర్‌ దొడ్డి వెళ్లే మార్గం దగ్గర ఓంకారేశ్వర మఠం, మణి కంఠ ఎత్తిపోతల పైభాగంలో ఇసుక తవ్వకాలు యథేచ్ఛ గా కొనసాగుతున్నాయి. నదిలోకి టిప్పర్లు వెళ్లేందుకు సిమెంట్‌పైపులైన్లు వేసి.. కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు నిర్మించారు. ఆ మట్టి రోడ్డుపై టిప్పర్లు, హిటాచీలు రోజూ తిరుగుతూ ఇసుక తవ్వకాలు చేసి.. రవాణా చేస్తున్నాయి. కర్ణాటక నుంచి వస్తున్న టిప్పర్లు రోజుకు 50 నుంచి 60 ట్రిప్పులు ఇక్కడ నుంచి ఇసుకను తరలిస్తున్నాయి. గతంలో స్థానికంగా ఉన్న ఓ మండల నాయకుడి టిప్పర్లు మాత్రమే నడిచేవి. అయితే కర్ణాటకలోని గుర్మిట్నల్‌ నాయకుడు ఒకరు ఇక్కడి టిప్పర్లను రానివ్వకపోవడంతో అక్కడి నుంచే రోజూ రాత్రి టిప్పర్లు నదిలోకి దిగుతున్నాయి. స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన హిటాచీ ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్‌కు రూ. 25వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి కర్ణాటకలోని రాయచూరు, కడైచూర్‌ ఇండస్ర్టీయల్‌ ఏరియా, సైదాపూర్‌, గుల్బర్గా వరకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే స్థానికంగా కృష్ణ, మాగనూర్‌, నారాయణపేట, మక్తల్‌ పట్టణాలకు కూడా ఇసుకను తరలిస్తున్నారు. టిప్పర్లు వెళ్లి రోడ్లు పాడవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు.

పాత- కొత్త నాయకుల పంచాయితీ...!

ఈ ఇసుక అక్రమ రవాణా పాత, కొత్త నాయకుల మధ్య పంచాయితీలకు దారితీసి విభేదాలకు ఆజ్యం పోస్తోంది. గతంలో బీజేపీలో ఉండి, తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందులో చేరి.. కృష్ణ మండలంలోని ఓ నాయకుడు ఇసుక దందా చేస్తున్నారు. గతంలో గుడెబల్లూరుకు చెందిన ఒక సెటిలర్‌, నియోజకవర్గంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు ఇందుకు మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏమైందో కానీ అదే గ్రామానికి చెందిన మరో సెటిలర్‌, ఇప్పటికీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్న సీనియర్‌ నాయకుడు సాయం పొందుతున్నారు. నలుగురు కాంగ్రెస్‌ లీడర్లు ఇందులో కీలకంగా వ్యవహరిస్తుండగా.. తాజాగా ఓ బీఆర్‌ఎస్‌ లీడర్‌ ఇందులో చేరిపోయారు. గతంలో దందాలో ఉన్న మరో ఇద్దరు కాంగ్రెస్‌ లీడర్లు దందాకు దూరమయ్యారు. అయితే గులాబీ నాయకుడిని అధికారులతో లాబీయింగ్‌, మామూళ్లు ముట్టజెప్పేందుకు కీలకంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇసుక దందా చేసే వ్యక్తి బీఆర్‌ఎస్‌లో ఉండగా.. కేవలం దందా కోసమే కాంగ్రెస్‌లో చేరారు. ఇప్పుడు కూడా అతడి కనుసన్నల్లోనే దందా నడుస్తుండటంతో కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్‌ నాయకులు నారాజ్‌లో ఉన్నారు. ఈ ఇసుక రవాణాను నియోజకవర్గ పెద్ద మనుషులే ఆపరేట్‌ చేస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైకి ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేస్తామని చెబుతున్నప్పటికీ.. తమకు చెడ్డపేరు రాకుండా బీఆర్‌ఎస్‌ నాయకులతోనే ఈ దందా చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మాజీ వైస్‌ ఎంపీపీ, ఒక మాజీ ఎంపీటీసీ, ఇద్దరు స్థానిక నాయకులు, ఒక బీఆర్‌ఎస్‌ నాయకుడు కీలకంగా ఉండటంతో విభేదాలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. జెండా పట్టి తిరిగిన వారిని కాదని, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన వారిని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తూగుతూ తమకేం తెలియదని బుకాయించుకుంటూ వస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి వస్తున్నా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు.

Updated Date - May 01 , 2025 | 11:31 PM