పెరుగనున్న యూనివర్సిటీ ప్రతిష్ట
ABN , Publish Date - Jun 09 , 2025 | 11:37 PM
టీజీ పీఈ సెట్ నిర్వహణతో పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు.
- ఈనెల 11 నుంచి టీజీ పీఈసెట్ ఎంపికలు
- ప్రారంభించనున్న ఉన్నత విద్యామండలి చైర్మన్
- పీయూ వీసీ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్
పాలమూరు యూనికవ ర్సిటీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి) : టీజీ పీఈ సెట్ నిర్వహణతో పాలమూరు యూనివర్సిటీ ప్రతిష్ట మరింత పెరుగుతుందని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ అన్నారు. యూనివర్సిటీ పరిపాలనా భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దిలీప్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రమేష్‌బాబుతో కలిసి మాట్లాడారు. యూనివర్సిటీలో మొదటి సిర్వహిస్తున్న పీఈసెట్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 11నుంచి 14 వరకు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ బాలకిష్టారెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. పీఈసెట్ ఎంపికల కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 కేంద్రాల్లో బీపీఎడ్, డీపీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలురకు అథ్లెటిక్స్‌లో 100, 800 మీటర్ల పరుగుపందెం, షాట్‌పూట్ 6 కిలోలు, లాంగ్ జంప్, హైజంప్‌లతో పాటు, బాల్ బాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాంగ్ టెన్నిస్ పోటీలను నిర్వహించనున్నట్లు వివరించారు. బాలికలకు అథ్లెటిక్స్‌లో 100, 400 మీటర్ల పరుగుపందెం, షాట్‌పుట్ 4 కిలోలు, లాంగ్‌జంప్, హైజంప్, బాడ్మింటన్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, లాంగ్ టెన్నిస్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు వీటిలో ఏదో ఒక క్రీడను ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాల కోసం టీజీ పీఈసెట్ వెబ్‌సైట్‌ను పరిశీలించాలని సూచించారు.