Share News

వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:25 PM

బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన వైభవంగా సాగుతున్నాయి. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని గోప్లా పూర్‌ గ్రామంలో మూడు రోజుల నుం చి ఈ ఉత్సవాలు వైభవంగా సాగుతు న్నాయి.

 వైభవంగా బొడ్రాయి ప్రతిష్ఠాపన
ఉత్సవాలను ఉద్దేశించి మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

- హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

పాన్‌గల్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : బొడ్రాయి, ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన వైభవంగా సాగుతున్నాయి. వనపర్తి జిల్లా పాన్‌గల్‌ మండలంలోని గోప్లా పూర్‌ గ్రామంలో మూడు రోజుల నుం చి ఈ ఉత్సవాలు వైభవంగా సాగుతు న్నాయి. అదేవిధంగా సత్యనారాయణ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటక శా ఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి వేర్వేరుగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... ప్రజలు ఐక్యమత్యంతో కలిసి మెలసి జీవించాలని, ఈ వేడుకలు భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. జీవితంలో మంచి చెడులే ఉంటాయని, మంచి చేస్తే వారిపేరు చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లా డుతూ... మత సామరస్యానికి చిహ్నంగా బక్రీదు, ధ్వజస్తంభ, బొడ్రాయి ప్రతి ష్ఠాపన జరగడం శుభ సూచకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌ సాగర్‌, కాంగ్రెస్‌ నాయకులు కేతేపల్లి రవి, వెంకటేష్‌ నాయుడు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:25 PM