ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం చేయాలి
ABN , Publish Date - May 17 , 2025 | 11:19 PM
మండ లంలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంక టేశ్వర్లు కొనుగోలు నిర్వాహకులను ఆదేశించా రు.
గోపాల్‌పేట, మే 17(ఆంధ్రజ్యోతి) : మండ లంలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంక టేశ్వర్లు కొనుగోలు నిర్వాహకులను ఆదేశించా రు. శనివారం మండలంలోని బుద్దారం, పొలికె పాడు, గోపాల్‌పేట, ఏదుట్ల, చెన్నారం గ్రామా ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలె క్టర్ సందర్శించారు. అకాల వర్షాలు పడుతుండ డంతో ధాన్యం తడిసిపోకుండా టార్పాలిన్ కవర్ల ను రైతులకు అందజేయాలని నిర్వాహకులకు ఆదేశించారు. రైతులు నిబంధనల ప్రకారం తా లు, గడ్డి లేని నాణ్యమైన ధాన్యం కొనుగోలు చే సేలా చర్యలు తీసుకోవాలని రైతులకు సూచిం చారు. కొనుగోలు అయిన ధాన్యాన్ని వెంటనే లా రీలకు ఎక్కించి గోదాముకు తరలించాలని అ న్నారు. కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.