మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Jul 25 , 2025 | 11:43 PM
రాష్ట్రంలో మహిళలను అన్నిరంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
రేషన్‌కార్డులు, వడ్డీలేని రుణాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
ధరూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలను అన్నిరంగాల్లో ఆర్థికంగా బలోపేతం చేయడంలో ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆ దిశగా వారి సర్వ తోముఖాభివృద్ధికి వివిధ రకాల సంక్షేమ పథకా లు, వడ్డీలేని రుణాలు అందజేసి అండగా ఉం టుందన్నారు. శుక్రవారం ధరూరులోని ఇందిరా మహిళాశక్తి మిషన్- 2025 సంబురాల కార్యక్ర మానికి ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్ బీ.ఎం.సంతోష్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యా రు. ముందుగా ఎమ్మెల్యే, కలెక్టర్‌కు మహిళలు బతుకమ్మతో ఘనస్వాగతం పలికారు. బతుక మ్మ పాటలకు నృత్యాలు చేశారు. అనంతరం అ ర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులను ఎమ్మెల్యే, కలెక్టర్ చేతులమీదుగా పంపిణీ చేశారు. మహి ళా సంఘాలకు సంబంధించిన రుణాలను ఎమ్మె ల్యే అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లా డుతూ మహిళలందరికీ ముందుగా శ్రావణమా సం శుభాకాంక్షలు తెలిపారు. గతంలో ఈ ప్రాం తంనుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేవార ని, తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఈ మండలం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చే శానని అన్నారు. ప్రతీ గ్రామంలో మహిళలు సంఘాల ఏర్పాటు చేసుకుని వచ్చిన రుణాలతో చిన్నచిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకు న్నారన్నారు. కలెక్టర్ సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలతో పాటు మహిళలకు కూడా ప్రాధానత్య కల్పిస్తూ వారిని ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. అందులో భాగంగా ఇందిరా మహిళాశ క్తి ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలు అందిం చి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా అండగా నిలిచిందన్నారు. మండలానికి 700 మంది అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మం జూరయ్యాయని తెలిపారు. లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చై ర్మన్ కురువ హనుమంతు, మాజీ జడ్పీ చైర్మన్ బండారి, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృ ష్ణారెడ్డి, రమేష్‌నాయుడు, మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, డీవై రా మన్న, ఉరుకుందు, విజయ్ రెడ్డి, వీరన్నగౌడ్, శ్రీ రాములు, భీమ్‌రెడ్డి, రంగస్వామి, దర్శల్లి, హను మంతు, యువనాయకులు పురుషోత్తం రెడ్డి, కృష్ణారెడ్డి, నరేష్‌గౌడ్, మహిళా సంఘం నాయ కులు ఉన్నారు.