Share News

మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:00 PM

పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడ మే ప్రభుత్వ లక్ష్యమ ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అ న్నారు.

 మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం
సీటీ స్కాన్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌

- రూ. 2.5 కోట్ల వ్యయంతో సీటీ స్కాన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల న్యూటౌన్‌, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడ మే ప్రభుత్వ లక్ష్యమ ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అ న్నారు. శుక్రవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రికి రూ. 2.5 కోట్ల వ్యయంతో నూ తన సీటీ స్కాన్‌ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ బీఎం సంతోష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...పేదలకు కార్పొరేట్‌ స్ధాయిలో వైద్యసేవలు అందాలన్న దృష్టితో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. గద్వాల ప్రాంతంలో నిరుపే ద ప్రజలు సీటీ స్కాన్‌ కొరకు కర్నూల్‌, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని రావాల్సి వస్తుండేదని, అయితే ఇ క ఆ సమస్య ఉండదన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... జిల్లా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు, ఎమ్మెల్యే సహకారంతో సీటీ స్కాన్‌ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన రోగనిర్ధారణ సేవలను అందించడానికి అత్యాధునిక కంప్యూటర్స్‌ టోమోగ్రఫీ, సీటీ స్కాన్‌ యంత్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డా క్టర్‌ ఇందిర, వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ హనుమంతు, జడ్పీ మాజీ చైర్మన్‌ బండారి భాస్కర్‌, గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రామన్‌గౌడ్‌, కాం గ్రెస్‌ సీనియర్‌ నాయకుడు గడ్డం కృష్ణారెడ్డి, మా ర్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీధర్‌గౌడు, జముల మ్మ ఆలయ కమిటీ చైర్మన్‌ వెంకట్రాములు, ము నిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కాంగ్రెస్‌ నాయకులు చిరు, వంట భాస్కర్‌, డాక్టర్లు ఉన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 11:00 PM