Share News

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి

ABN , Publish Date - Mar 17 , 2025 | 11:06 PM

పంటలు ఎండు తున్నా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు.

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఎండిన వరి పంటను పరిశీలిస్తున్న మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

- ఎండిన పంటలను పరిశీలించిన మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి రూరల్‌, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): పంటలు ఎండు తున్నా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం వనపర్తి మండలంలోని పెద్దగూడెం తండాలో కరెంటు కోతలు, నీటి ఎద్దడి కారణంగా ఎండిన పంటలను పరిశీలిం చా రు. రైతు జూలనాయక్‌ సాగుచేసిన పంటను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడు తూ... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిత్యం కేసీఆర్‌ ను నిందించడం తప్ప రైతులు, ప్రజల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం 3 ఎక రాలలోపు రైతు భరోసా ఇచ్చామని చెప్పడం బూటకమని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లెక్కల ప్రకారం 3 ఎకరాలలోపు రైతులకు 58లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇస్తే మిగతా 9 లక్షల 30వేల ఎకరాలకు వివిధ రైతుభరోసా ఎగ్గొట్టినట్లేనని విమర్శించారు. ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం సరిగా పని చేసి ఉంటే 448 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేవారు కాదని, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయేవి కాదని అన్నారు. ఆయన వెంట బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాణిక్యం, ధర్మా నాయక్‌, కృష్ణా నాయక్‌, తది తరులు ఉన్నారు.

Updated Date - Mar 17 , 2025 | 11:07 PM