Share News

పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , Publish Date - Oct 11 , 2025 | 10:53 PM

అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి రై తులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు.

పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న రైతు సంఘం నాయకులు

అయిజ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న పత్తి రై తులను ఆదుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం అయిజ, సంకాపూర్‌ గ్రామాలలో దెబ్బతిన్న పత్తి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. అధిక వర్షాలు కారణంగా పుప్పొడి రాలి, కాయలు మురిగి, పత్తి నాని పూర్తి స్థాయిలో రైతులు నష్టపోయారని తెలిపారు. సీడ్‌పత్తి సాగుచేస్తున్న రైతులకు ఈ సారి పెట్టుబడి కింద తక్కువ మొత్తంలో అంద జేయటంతో, వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడి పెట్టారని వివరించారు. ప్రతీ రైతుకు రూ. 2 లక్షలు నష్ట పరిహారం ఇవ్వాలని, వచ్చిన సీడ్‌ పత్తి మొత్తాన్ని కంపెనీలు కొనుగోలు చేసే వి ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో నర్సింహ, నర్సింహులు, మ ల్లేశ్‌, శివన్న, తిరుమలేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 10:53 PM